SRD: కంది మండలం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అగ్నిమాపక శాఖ సహకారంతో మాక్ డ్రిల్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అత్యవసర సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి వివరించారు. అగ్నిమాపక భద్రత, అత్యవసర పరిస్థితుల్లో నిర్వహించాల్సిన బాధ్యతల గురించి ఉద్యోగులలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారులు నాయుడు, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.