TPT: నారాయణవనం కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం శ్రావణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో స్వామివార్లను సుప్రభాత సేవలతో మేల్కొలిపారు. శుద్ధి, పుణ్యావచనం, నిత్య కైంకర్యాలు చేశారు. ఉత్సవర్లను వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు, నారీకేళ జలాలతో అభిషేకించారు. అనంతరం అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం తిరుచ్చి వాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు.