MHBD: మొంధా తుఫాన్ నేపథ్యంలో తొర్రూరు మండల వ్యాప్తంగా బుధవారం కురిసిన భారీ వర్షానికి పంట పొలాలు నీట మునిగి జలమయమయ్యాయి. కొంతమంది రైతుల వరి పంట నేలకొరిగి… పత్తి పంట తడిసి ముద్దయింది. వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకుతున్న తరుణంలో ఈ అకాల వర్షాలతో పంట నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.