అల్లూరి: చింతపల్లి మండలం లంబసింగిలో గురువారం ఎస్సైలు వెంకటేశ్వర్లు, ఎం.వెంకటరమణతో కలిసి సీఐ వినోద్ బాబు పర్యటించారు. తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఆయన పర్యటన సాగింది. ముందుగా లంబసింగి ఘాట్ పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా విరిగి పడిన చెట్లు, బండరాళ్లను తొలగించామని మీడియాకు తెలిపారు. ఇంకా వర్షాలు పడుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.