NZB: మోపాల్ మండలం మంచిప్ప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల డైనింగ్ హాల్ నిర్మాణం అసంపూర్తిగా మారింది. గత ప్రభుత్వంలో మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా డైనింగ్ హల్ నిర్మాణాన్ని చేపట్టారని గ్రామస్తులు తెలిపారు. చేసిన పనులకు బిల్లులు రాకపోగా డైనింగ్ హాల్ నిర్మాణాన్ని కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలేసాడని అన్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించలన్నారు.