NZB: జిల్లా కేంద్రంలోని శ్రీ నీలకంఠేశ్వరాలయంలో కలెక్టర్ వినయ్కృష్ణా రెడ్డి దంపతులు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఈవో శ్రీరాం రవీందర్ తెలిపారు. ఆలయానికి వచ్చిన కలెక్టర్ దంపతులు స్వామివారికి అభిషేకాలు, హారతి, మొదలగు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కలెక్టర్ దంపతులను శేష వస్త్రముతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.