GNTR: గుంటూరు నగరంలో వర్షపు నీరు, మురికినీరు నిలిచిపోయి పలు కాలనీల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు గురువారం స్వయంగా ఫీల్డ్లోకి దిగి పర్యటించారు. చుట్టగుంట మురికిపేట ప్రాంతంలో ఆయన బురద, నిల్వ నీటిలో నడుచుకుంటూ ప్రజలను ప్రత్యక్షంగా పరామర్శించారు.