NZB: ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యంపై కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులపై గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల అలసత్వం వహించడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ రెంజల్ మండల వ్యవసాయ అధికారికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కొనుగోలు కేంద్రం నిర్వహణలో లోటుపాట్లు ఉండడాన్ని కలెక్టర్ గమనించారు.