NTR: మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎగువ నుంచి వచ్చిన వరదల కారణంగా పెనుగంచిప్రోలులోని మున్నేరు బ్రిడ్జిని ఆనుకొని వరద ప్రవాహం కొనసాగుతుంది. కావున అధికారులతో కలిసి ఎమ్మెల్యే తాతయ్య గురువారం బ్రిడ్జిని పరిశీలించారు. బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేయాలన్నారు. అదేవిధంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.