టీమిండియాతో జరుగుతున్న ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా బ్యాటర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ అద్భుతమైన సెంచరీ సాధించింది. ఆమె కేవలం 78 బంతుల్లో 17 ఫోర్లు, ఒక సిక్సర్‌తో శతకాన్ని పూర్తి చేసుకుంది. ఇది ఆమెకు ప్రపంచకప్‌లో తొలి సెంచరీ కావడం విశేషం. ప్రస్తుతం 24 ఓవర్లలో ఆస్ట్రేలియా ఒక వికెట్ నష్టానికి 157 పరుగులు చేసింది.