HYDలో బంగారం ధరలు ఉదయం తగ్గినప్పటికీ, సాయంత్రానికి భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఉదయం రూ.1,910 తగ్గగా, ఇప్పుడు రూ.990 పెరిగి.. రూ.1,21,480కి చేరుకుంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఉదయం రూ.1,750 తగ్గినా, సాయంత్రానికి రూ.900 పెరిగి రూ.1,11,350గా నమోదైంది. కాగా, కిలో వెండి ధర(రూ.1,65,000) ఉదయంతో పోలిస్తే ఎలాంటి మార్పు లేదు.