TG: వరంగల్ జిల్లాలో సహాయక చర్యలను వెంటనే ముమ్మరం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వెంటనే అవసరమైన పడవలను అక్కడికి పంపించాలని సూచించారు. SDRF సిబ్బందిని తక్షణమే తరలించాలని సీఎస్, డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. హైడ్రా సిబ్బందిని, వరద సహాయక సామాగ్రిని అత్యవసరమైన చోట వినియోగించాలి. ముంపు ప్రాంతాల్లో ఉన్నవారిని వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించాలని సీఎం ఆదేశించారు.