KNR: వర్షాల వల్ల కలిగిన పంట, ఆస్తి నష్టం, తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా ఉన్నతాధికారులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో వర్షాల కారణంగా 8 పశువులు మరణించాయని, వీటి యజమానులకు వెంటనే నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు.