ASF: కాగజ్ నగర్ మండలం కోసిని, రేగుల గూడ, కూసుగుడా తదితర గ్రామాల రైతులు తమ పత్తి పంటను అడవి పందులు నాశనం చేస్తున్నాయని FRO ఆఫీస్ ఎదుట గురువారం ధర్నా చేశారు. ధర్నాకు BRS నాయకులు మద్దతు తెలిపారు. పంట నష్టాన్ని సర్వే చేయించి రైతులకు తగిన నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. FDO స్పందించి పంట నష్టాన్ని సర్వే చేయించి నష్టపరిహారం ఇవ్వడానికి హమీ ఇచ్చారు.