KMR: వర్షాల కారణంగా KMR పట్టణంలో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. KMR మున్సిపాలిటీ పరిధిలోని రాజంపేటలో జరుగుతున్న పారిశుద్ధ్య పనుల తీరును ఆయన పరిశీలించారు. మురుగు నీటి పారుదల, చెత్త సేకరణ, రోడ్ల శుభ్రత వంటి అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.