కృష్ణా: వర్షాలు కాలం నేపథ్యంలో గ్రామాలలో వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు గుడ్లవల్లేరు మండలంలో యుద్ధ ప్రాతిపదికన చెత్తాచెదారాన్ని తొలగించే పనులను గురువారం చేపట్టారు. శానిటరీ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలు శుభ్రతను పాటించాలని, చెత్తను ఎక్కడపడితే అక్కడ వెయ్యకుండా పరిశుధ్యానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.