TPT: తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టాలని కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా రోడ్లు, డ్రైనేజీ కాలువలు దెబ్బతిన్న ప్రాంతాల్లో తక్షణ మరమ్మతులు చేయాలని సూచించారు. అనంతరం తాగునీరు కలుషితం కాకుండా రోజూ నీటి పరీక్షలు నిర్వహించాలన్నారు. నగరంలో చెత్త, బురద తొలగించి బ్లీచింగ్ వేయాలని ఆదేశించారు.