VZM : లక్కవరపుకోట మండల కేంద్రంలో గల తుఫాన్ ప్రభావిత బాధిత కుటుంబాలకు ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తన చేతుల మీదుగా రేషన్ సరుకుల పంపిణీ చేశారు. ఈ మేరకు తుఫాన్ ప్రభావిత కుటుంబాలకు ఉచితంగా అవసరమైన నిత్యావసర వస్తువుల పంపిణీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.