కృష్ణా: ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొంథా తుపాను బాధితులు, ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, వీవర్స్ కుటుంబాలకు ఆర్థిక సాయం, నిత్యావసరాలు పంపిణీ చేయనున్నారు. పునరావాస కేంద్రాలలో ఒక్కరికి రూ. 1000 నుంచి రూ.3వేల వరకు నగదు, 50 కేజీల బియ్యం, పప్పు, పంచదార, కూరగాయలు వంటి నిత్యావసరాలను నేడు అందజేయనున్నారు.