HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మాజీ ఎంపీపీ రవీందర్ యాదవ్ అన్నారు. BRS అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా రహమత్ నగర్ డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం KCR సంక్షేమ పథకాలను ప్రజలు మరిచిపోలేదని, మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి పనులు BRSను గెలిపిస్తాయన్నారు.