ATP: గుత్తి పట్టణ శివారులోని తాడిపత్రి రోడ్డులో గురువారం రాత్రి రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.