TG: హన్మకొండ జిల్లాలోని గోపాలపురంలో రోడ్డు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి బృందం వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో 12 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సిద్దిపేటకు నల్లపూసల వేడుకకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది.