MBNR: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ బాలుర హాస్టళ్లను జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని నేరుగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అలాగే సమయం వృధా చేయకుండా చదువుపై దృష్టి సారించాలని విద్యార్థులకు ఆయన సూచించారు.