ATP: తాడిపత్రి పట్టణం యాడికి మండలాల్లో నేడు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ట్రాన్స్కో అధికారులు ప్రకటించారు. తేరన్నపల్లి గ్రామంలోని 220 కేవీ సబ్స్టేషన్లో కొత్తగా బ్రేకర్ ఏర్పాటు చేస్తుండటంతో ఈ అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. ఈ మేరకు వినియోగదారులు సహకరించాలని కోరారు.