ATP: గుత్తిలోని పురపాలిక కౌన్సిల్ సమావేశం కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో వాయిదా పడింది. గురువారం సమావేశానికి అధ్యక్షురాలు పన్నూరుబీ, ముగ్గురు కౌన్సిలర్లు వచ్చారు. పురపాలికలో 25 వార్డులుండగా ఒకరు టీడీపీ, 24 మంది కౌన్సిలర్లు వైసీపీకి చెందిన వారే. కోటి సంతకాల సేకరణలో భాగంగా కౌన్సిలర్లు సమావేశానికి రాలేదని కమిషనర్ జబ్బర్ మియా తెలిపారు.