AP: రాష్ట్రంలోని పలు జిల్లాలో ఇవాళ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కోనసీమ, ఏలూరు, కృష్ణా సహా ఉభయ గోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురస్తాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షం వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని సూచించింది.