KRNL: మంత్రాలయం మండలం చెట్నేహళ్లిలోని జిన్నింగ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోళ్ల కేంద్రాన్ని మండల వ్యవసాయాధికారి జీరా గణేష్ గురువారం పరిశీలించారు. కొనుగోలు కేంద్రం వద్ద ఏర్పాట్లను తనిఖీ చేసి, పత్తి నాణ్యత, తేమ శాతాన్ని పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన యాజమాన్యానికి సూచించారు.