SKLM: కేసుల దర్యాప్తులో నాణ్యత, వేగం ప్రాధాన్యమని SP కేవీ మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న ప్రాపర్టీ కేసులపై దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రతి కేసు దశల వారీగా పర్య వేక్షించాలన్నారు. కేసు దర్యాప్తులో భౌతిక ఆధారాలు సాధన కీలకమని ఆయన సూచించారు.