SKLM: మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మైనారిటీ అభ్యర్థులకు ఎస్సై కానిస్టేబుల్, టెట్, డీఎస్సీ ఉద్యోగాల కోసం ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు ED కె. కుమారస్వామి తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. విజయనగరం శ్రీకాకుళం, మన్యం, పార్వతీపురం జిల్లాల్లో ఆసక్తి గల అభ్యర్థులు https://apcedmmwd.org వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.