SKLM: ఎచ్చెర్లలలో ఉన్న శ్రీ సద్గురు సాయినాథ, సహిత శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి, ఆలయంలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు పదివేల దీపారాధన, కార్యక్రమం చేపడుతున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు రమణ తెలిపారు. అదేవిధంగా నవంబర్ 6వ తేదీన 3వ వారం మహా అన్నదాన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని గమనించి భక్తులంతా పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరన్నారు.