BDK: దమ్మపేట మండలం నాగుపల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంగోత్ నాగు–భార్గవి దంపతుల కొత్త ఇంటిని ప్రారంభించి వారి కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. సొంత ఇంటి కలను నెరవేర్చడం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే సాధ్యమని అన్నారు.