KMR: బాన్సువాడ సంగమేశ్వర కాలనీలో గురువారం ఉదయం వీధికుక్కలు పలువురిపై దాడి చేశాయి. ఈ దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీధికుక్కల బెడదపై మున్సిపల్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని మాజీ వార్డు సభ్యుడు షేక్ అక్బర్ డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకుంటే ధర్నాలు చేపట్టి, సమస్యను సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని కాలనీ వాసులు హెచ్చిరించారు.