RR: మొంథా తుఫాన్ ప్రభావానికి మొక్కజొన్న, వరి, పత్తి, ఇతర పంటలు దెబ్బతిని రైతులకు తీవ్ర పంట నష్టం జరిగిందని షాద్నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతన్నలను ఆదుకోవాలని, నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.20 వేలు చెల్లించాలన్నారు. తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేసి అన్నదాతలకు న్యాయం చేయాలన్నారు.