GNTR: ‘మొంథా’ తుపాను కారణంగా ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు, ఉపనదుల నుంచి వచ్చిన ఆకస్మిక వరదలతో కృష్ణా నదికి ప్రవాహం వేగంగా పెరుగుతోంది. గురువారం ప్రకాశం బ్యారేజీకి ఇన్ఫ్లో 6,00,000 క్యూసెక్కులు దాటే అవకాశం ఉంది. వరద వేగం దృష్ట్యా, ప్రజలు మరియు అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలని రివర్ కన్జర్వేటర్ హెచ్చరించారు.