NLG: మొంథా తుపాన్ ప్రభావం రైళ్ల రాకపోకలపై పడింది. సికింద్రాబాద్ నుంచి నల్గొండ మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. జన్మభూమి, విశాఖ, ఫలక్ నుమా రైళ్లు బుధవారం ఆలస్యంగా నడిచాయి. గురువారం ఉదయం రావాల్సిన పల్నాడు ఎక్స్ప్రెస్ రద్దయినట్లు రైల్వే అధికారులు తెలిపారు.