VZM: విశాఖపట్నం జీఆర్పీ లైన్స్ సీఐ ఎ. రవికుమార్ విజయనగరం జీఆర్పీ స్టేషన్ ను గురువారం తనిఖీ చేశారు. సిబ్బంది విధులపై ఎస్సై బాలాజీరావును అడిగి తెలుసుకున్నారు. ముందుగా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రికార్డులను పరిశీలించి, తగు సూచనలు చేశారు. రాత్రి విధులు పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. రైళ్లలో అక్రమ గంజాయి తరలించకూండా నిఘా పటిష్ఠం చేయాలని సూచించారు.