GDWL: మండలం వీరాపురం దగ్గర ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న థామస్ అనే విద్యార్థిని గురువారం ఉపాధ్యాయుడు తీవ్రంగా చితకబాదినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనను బీఆర్ఎస్పీ జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య తీవ్రంగా ఖండించారు. గురుకులంలో మౌలిక సదుపాయాలు కల్పించకుండా, నాణ్యమైన భోజనం అందించడం లేదని మండిపడ్డారు.