MBNR: జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా శిశు దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనిత రామచంద్రన్ ఆదేశించారు. గురువారం రాత్రి మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఐసిడిఎస్ అధికారులతో సమీక్షించారు.