SKLM: కార్తీక మాసం విశిష్ట రోజులు పురస్కరించుకుని పలాస మండలం వ్యాప్తంగా అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువ జామున 3 గంటల నుంచి భక్తులు సమీపంలోని చెరువులు, నదీ ప్రవాహంలో దీపారాధన అనంతరం శివయ్య దర్శనానికి బారులు తీరారు. ఆలయ అర్చకులు, దాతలు, నిర్వాహకులు, శివ, అయ్యప్ప స్వామి దీక్షాపరులు భక్తుల దర్శనానికి ఆటంకం లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.