NLG: గత మూడు రోజులుగా కురిసిన అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని ఈరోజు ఉదయం 10 గంటలకు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.