NLR: తుపాన్ ప్రభావంతో సీతారామపురం మండలంలో కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. ఈ ప్రకృతి వైపరీత్యంలో ఆరు మేకలు కూడా ప్రాణాలు కోల్పోయాయి. దీంతో పశు పోషకులకు లక్షల్లో నష్టం వాటిల్లింది. చేతికి వచ్చిన పంట నీట మునగడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తుపాన్ రైతులు, పశు పోషకులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.