UP బహ్రైజ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. భరత్‌పుర్ సమీపంలోని కౌదియాలా నదిలో 22 మందితో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఐదుగురు పిల్లలు సహా 8 మంది గల్లంతయ్యారు. అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి మిగతా 13 మందిని రక్షించారు. నది ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో గల్లంతైనవారు మరణించి ఉంటారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.