TG: మొంథా తుపాను ప్రభావంతో కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో భారీ వర్షాలు కురిశాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 145 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వెనుకేపల్లి కట్టు కాలువకు గండిపడింది. ఆకునూరు, గొల్లగూడెం గ్రామాల మధ్య వరద ప్రవాహం అధికంగా ఉండటంతో కల్వర్టు తెగిపోయింది.