KNR: శంకరపట్నం మండలంలో అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మొంథా తుఫాను ఎఫెక్ట్‌తో వేకువజామున నుంచి వర్షం కురుస్తుంది. చేతికి వచ్చిన పంట అకాల వర్షానికి తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులు ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. ధాన్యం తడవకుండా ఉండేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు.