SKLM: అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో నవంబర్ 2న కార్తీక శుద్ధ ద్వాదశి సందర్భంగా స్వామివారి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ప్రసాద్ బుధవారం ఓ ప్రకటన లో తెలిపారు. ఆదివారం సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు జరిగే ఈ ఉత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తూ,తగిన పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.