NZB: భీమగల్ లింబాద్రిగుట్ట బ్రహ్మోత్సవాలు ముఖ్య ఘట్టానికి చేరుకున్నాయి. రేపు గుట్టపై శ్రీవారి కళ్యాణం నిర్వహించనున్నట్లు వ్యవస్థాపక ధర్మకర్త నంబి లింబాద్రి తెలిపారు. మధ్యాహ్నం 12:30 గంటలకు కళ్యాణ మహోత్సవం జరగనుందని, భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి అనుగ్రహం పొందాలన్నారు. భక్తుల రాకపోకలకు, భోజన ప్రసాదం, నీటి వసతులు ఇలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.