E.G: రోడ్ల నిర్మాణంలో నాణ్యతా లోపం ఉంటే ఉపేక్షించేది లేదని కమిషనర్ రాహుల్ మీనా హెచ్చరించారు. గురువారం ఆయన దానవాయిపేట, పప్పుల వీధి సహా పలు ప్రాంతాలలో రోడ్డు నిర్మాణ పనులను పర్యవేక్షించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల నిర్మించిన రోడ్ల నాణ్యతను పరిశీలించి, విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని అధికారులకు పలు సూచనలు చేశారు.