VZM: సంతకవిటి మండలం కొతూరు రామచంద్రపురం గ్రామాలను గురువారం స్దానిక MRO సుదర్శన్ రావు సందర్శించారు. ఉదయం నుంచి వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఆ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. నాగావలి నదిలో పశువులు, ప్రజలు దిగకుండా బారికేడ్లు కట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నది భారీగా ప్రవహిస్తూ ఉండడంతో ఎవరూ వెళ్లవద్దని సూచించారు.