సిరిసిల్ల: కోనరావుపేట మండలంలో మొంథా తుఫాన్ కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మండల కేంద్రంలో తాళ్ల పెళ్లి జ్యోతికి చెందిన ఇల్లు గురువారం కూలిపోయింది. దీంతో నర్సవ్వ అనే మహిళలకు గాయమైనట్లు గ్రామస్తులు తెలిపారు. పలు గ్రామాల్లోని వీధులు బురుదమయమైనట్లు పేర్కొన్నారు.