ELR: జిల్లాలో 90 తుఫాన్ సహాయక కేంద్రాలు ఏర్పాటుచేసి, 3,422 కుటుంబాలకు చెందిన 7,000 మందికి భోజన, వసతి సదుపాయాలు కల్పించామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. జిల్లాలో తుఫాన్ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో సహాయక శిబిరాలు బుధవారం రాత్రి వరకు నిర్వహిస్తామని, బాధిత కుటుంబాలు ఇంటికి వెళ్లే సమయం వరకు ఒక్కో కుటుంబాని 25 కేజీల బియ్యం, నిత్యవసరాలు అందించామని తెలిపారు